AUS vs PAK 2024: కమ్మిన్స్ స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఇంగ్లిస్

AUS vs PAK 2024: కమ్మిన్స్ స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఇంగ్లిస్

ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ జట్టుపై నవంబర్ 4 నుండి 18 వరకు వన్డే, టీ20 సిరీస్ లు ఆడనుంది. ఈ టూర్‌లో ఇరు జట్ల మధ్య మొదట వన్డే ఆ తర్వాత టీ20 సిరీస్ జరగనుంది. మూడు వన్డేలు వరుసగా నవంబర్ 04, 08,10 తేదీలలో జరుగుతాయి. నవంబర్ 14, 16, 18 తేదీలలో వరుసగా మూడు టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. ఇప్పటికే ఇరు జతల మధ్య తొలి వన్డే ముగిసింది. అయితే మూడో వన్డే నుంచి జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 

వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్.. పాకిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్ తో పాటు చివరిదైన మూడో వన్డేకు కెప్టెన్సీ చేయనున్నాడు. నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుండడంతో కమ్మిన్స్ పాకిస్థాన్ తో చివరి వన్డేతో పాటు టీ20 సిరీస్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కమ్మిన్స్ తో పాటు ప్రస్తుతం పాకిస్థాన్ తో వన్డే సిరీస్ ఆడుతున్న మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్ లాంటి  కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుని భారత్ తో జరిగే టెస్ట్ సిరీస్ పై దృష్టి సారిస్తారు. వన్డే జట్టులో స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్ ను ఎంపిక చేశారు. 

ఆస్ట్రేలియా వన్డే జట్టు:

పాట్ కమ్మిన్స్ (కెప్టెన్ - మొదటి రెండు మ్యాచ్‌లు), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్ - మూడో మ్యాచ్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్ (మూడో మ్యాచ్ మాత్రమే), కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్ (రెండో మ్యాచ్ మాత్రమే), స్పెన్సర్ జాన్సన్ (మూడో మ్యాచ్ మాత్రమే), మార్నస్ లాబుస్చాగ్నే (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే), గ్లెన్ మాక్స్‌వెల్, లాన్స్ మోరిస్, జోష్ ఫిలిప్ (మూడో మ్యాచ్ మాత్రమే), మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే), మిచెల్ స్టార్క్ ( మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే), మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

Also Read : ఐపీఎల్ వేలంలో ఇటలీ ప్లేయర్

ఆస్ట్రేలియా టీ20 జట్టు:

జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా