సాధారణంగా న్యూస్ రీడర్లు అంటే.. ప్రొఫషనల్ గా ఉంటారు. సింపుల్ గా ఉండి న్యూస్ ను ప్రజంట్ చేస్తుంటారు. అయితే ఓ న్యూస్ యాంకర్ మాత్రం ముఖంపై టాటూపై వేసుకొని న్యూస్ చదివింది. అదీ కూడా ప్రైమ్ టైమ్ లో. ఈ ఘటన న్యూజిలాండ్ లో జరిగింది. గడ్డం మీద టాటూ వేసుకొని న్యూస్ ప్రజంటేషన్ ఇచ్చింది. అయితే దీనికి కారణం కూడా ఉంది. ఆమె ఇలా టాటూతో న్యూస్ చదవడానికి ఓ బలమైన రీజన్ ఉంది. గడ్డం మీద టాటూతో న్యూస్ చదివిన మొదటి న్యూస్ రీడర్ ఈమె. పేరు ఒరీని కైపారా. న్యూజిలాండ్‌లో ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్లో పనిచేస్తోంది. గడ్డం మీద టాటూతో ప్రైమ్ టైమ్ న్యూస్ చదువుతున్న ఒరీనీ సోషల్‌మీడియా సెలబ్రిటీ అయిపోయింది.
అలాగని ఆ టాటూ సరదాగా వేసుకోలేదామె. వాళ్ల కల్చర్‌లో అదో భాగం. ఈ న్యూస్ రీడర్ది మావోరీ ట్రైబ్. ఈ ట్రైబ్ ఆడవాళ్లు వాళ్ల కల్చర్‌లో భాగంగా గడ్డం మీద టాటూ వేయించుకుంటారు. ఈ టాటూను ‘మోకో కవూ’ అంటారు. 2017లో ఒరీనీ డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంది. అందులో ఆమె మావోరీ ట్రైబ్‌కి చెందిందని తెలిసింది. దాంతో 2019లో తమ కల్చర్‌కు గుర్తుగా మావోరీ టాటూ వేయించుకుంది. మధ్యాహ్నం వార్తలు మాత్రమే చదివే ఒరీనీ అనుకోకుండా గత వారం ప్రైమ్ టైమ్ న్యూస్ చదివింది. ముఖం మీద టాటూతో ఆమె చదివిన ప్రైమ్ టైం బులెటిన్ వైరల్ అయింది. అంతేకాకుండా తన ఇన్స్టాగ్రాం అకౌంట్లో ‘6 పీఎమ్ డెబ్యూ’ క్యాప్షన్‌తో పెట్టిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘మావోరీ కల్చర్‌ను అందరికీ తెలిసేలా చేశావు. మావోరీ ఉమెన్‌కు ఇన్స్పిరేషన్గా నిలిచావం’టూ ఓరీనీని మెచ్చుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
మాస్క్ సరిగాపెట్టుకో.. వృద్ధుడిపై యువతి దాడి
ఐఫోన్ ఆర్డర్ చేస్తే చాక్లెట్ వచ్చింది