హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) హర్షం వ్యక్తంచేసింది. సీఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇంటి స్థలాలపై సీఎం టైమ్ బౌండ్ ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన డీజేహెచ్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేకంగా తీర్మానం చేసింది.
ఈ సమావేశంలో డీజేహెచ్ఎస్ అధ్యక్షుడు బొల్లోజు రవి, ఉపాధ్యక్షుడు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు ప్రతాప్ రెడ్డి, డి.రామకృష్ణ, నాగరాజు, సలహాదారు విక్రమ్, సభ్యులు డి.సురేశ్ బాబు తదితరుల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది.