తొమ్మిదేండ్ల బిడ్డకు ఉరివేసి .. వరంగల్​లో జర్నలిస్ట్ ​సూసైడ్‍

  •  బాలసముద్రం ఏకశిల పార్కు 
  • వద్ద ఉన్న ఆఫీసులో ఘటన 
  • ఆర్థిక సమస్యలే కారణమన్న బంధుమిత్రులు

 వరంగల్‍, వెలుగు : వరంగల్​లోని ఓ ఛానల్‍లో స్టాఫ్‍ రిపోర్టర్‍గా పనిచేస్తున జర్నలిస్ట్​ గట్టిగొప్పుల యోగిరెడ్డి (36) తన కూతురితో కలిసి శుక్రవారం ఆత్యహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల కథనం మేరకు..యోగిరెడ్డి గతంలో వివిధ మీడియా ఛానళ్లలో కెమెరామెన్‍గా పనిచేశాడు. ఏడాదిన్నర క్రితం స్టాఫ్‍ రిపోర్టర్‍ స్థాయికి ఎదిగాడు. ఏడాదిగా ఓ ఛానల్​లో పని చేస్తున్నాడు. 

హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద ఆఫీస్‍ ఉంది. సంస్థాపరంగా కొన్ని సమస్యలకు తోడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నాలుగో తరగతి చదువుతున్న తన కూతూరు ఆద్యారెడ్డి (9)తో కలిసి శుక్రవారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లిన యోగి సాయంత్రం వరక ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు కాల్‍ చేసినా ఫోన్‍ ఎత్తలేదు. 

దీంతో ఆయన ఛానన్​ఆఫీసు గదిలోకి వెళ్లి చూడగా ఇద్దరు ఉరి వేసుకుని కనిపించారు. అప్పటికే పాప కొన ఊపిరితో ఉండగా, యోగి చనిపోయాడు. దీంతో ఆద్యాను పక్కనే ఉన్న ప్రైవేట్​హస్పిటల్‍కు తరలించి ట్రీట్‍మెంట్‍ అందిస్తుండగా చనిపోయింది. ముందు కూతురికి ఉరివేసిన యోగి, తర్వాత తాను కూడా ఉరేసుకున్నట్టు తెలుస్తోంది. అసలు కారణమేంటో తేల్చే క్రమంలో పోలీసులు ఉన్నారు.