కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ పట్టణానికి చెందిన చెన్నూరి సందీప్ కుమార్(33) అనే జర్నలిస్ట్ గుండెపోటుతో మృతి చెందాడు. కొన్నేండ్లుగా ఎలక్రానిక్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న సందీప్ బుధవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయనను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. డాక్టర్ల సూచన మేరకు మంచిర్యాలకు తరలించి ట్రీట్మెంట్ అందిస్తుండగా అర్ధరాత్రి సందీప్‌కు గుండెపోటు వచ్చి హాస్పిటల్లో మృతి చెందాడు.
ఆయన అంత్యక్రియలు గురువారం పూర్తికాగా.. సిర్పూర్ (టీ) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కోనేరు ట్రస్ట్ చైర్మన్ వంశీ, జర్నలిస్ట్ సంఘాల జిల్లా నాయకులు రవి నాయక్, అబ్దుల్ రెహమాన్, అరుణ్ కుమార్, స్థానిక జర్నలిస్టులు నివాళి అర్పించారు.