ఓ జర్నలిస్టును కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టారు. చెట్టుకు కట్టేసి చెంపలు వాయిస్తూ, పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రకాశ్ యాదవ్ అనే వ్యక్తి ఓ టీవీ ఛానల్‌లో పని చేస్తున్నారు. ఈ నెల 25న విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి వెళ్తుండగా..నారాయణ్ యాదవ్ అనే వ్యక్తి అతడిని అడ్డగించాడు. జనవరి 1న జరిగిన ఓ సంఘటనపై జర్నలిస్ట్ ప్రకాష్తో అతడు గొడవకు దిగాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న నరేంద్ర యాదవ్ అనే మరో వ్యక్తి జర్నలిస్టును దుర్భాషలాడారు. ఈలోగా అక్కడికి చేరిన మరికొందరు జర్నలిస్ట్ను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. జర్నలిస్టు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీని తొలగించండి, మధ్యప్రదేశ్‌ను రక్షించండి అని ట్వీట్ చేసింది.