
హైదరాబాద్ సిటీ, వెలుగు: నవ భారత్ నిర్మాణ సంఘం, పాలడుగు నాగయ్య కళాపీఠం సంయుక్తంగా సీనియర్ జర్నలిస్టు వరకాల యాదగిరికి అల్లూరి సీతారామరాజు స్మారక పురస్కారాన్ని ప్రదానం చేసింది. రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ఆయనకు జ్ఞాపిక, నగదు పురస్కారం, అవార్డును అందజేశారు.
భారత వైమానిక దళ రిటైర్డ్ మేజర్ జనరల్ ఎం. శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ ఎన్ కరుణాకర్ రెడ్డి, నవభారత నిర్మాణ సంఘం అధ్యక్షుడు సూరేపల్లి రవికుమార్, పాలడుగు కళాపీఠం అధ్యక్షురాలు, పాలడుగు సరోజినీ దేవి, అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు తుమ్మ సత్యనారాయణ పాల్గొన్నారు.