- కలెక్టరేట్ ఎదుట జర్నలిస్ట్‌ల నిరసన
మెదక్, వెలుగు: కవరేజ్‌కు వెళ్లిన వివిధ టీవీ చానెల్ప్రతినిధులపై దాడికి పాల్పడిన సీనియర్ సినీ నటుడు మంచు మోహన్ బాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు ఎ.శంకర్ దయాళ్ చారి డిమాండ్ చేశారు. మోహన్ బాబు తీరును ఖండిస్తూ బుధవారం మెదక్ కలెక్టరేట్ ముందు జర్నలిస్ట్‌లు నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం అందజేశారు.
శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ.. మోహన్ బాబు విలనిజం జర్నలిస్టులపై నడవదన్నారు. మోహన్ బాబుపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు, ఐజేయూ మాజీ సభ్యులు ఫరూక్ హుస్సేన్, నాయకులు మురళీధర్ గుప్తా, శ్రీధర్, శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, శేఖర్, శ్రీనివాస్, ఆంజనేయులు, కృష్ణమూర్తి, హమీద్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
మోహన్ బాబును అరెస్టు చేయాలి
పటాన్‌చెరు, వెలుగు: జర్నలిస్టులపై యాక్టర్ మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్య అని పటాన్‌చెరు జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బుధవారం పటాన్‌చెరు పట్టణ కేంద్రంలో బాంబే హైవేపై ధర్నా చేశారు. అంబేద్కర్ విగ్రహ సాక్షిగా నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ జర్నలిస్టుపై దాడికి పాల్పడిన మోహన్‌బాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాఘవరెడ్డి, అశ్వక్, సుదర్శన్ రెడ్డి, బాసిత్, బసవేశ్వర్, కాశీపతి, నరసింహ, రఘురామిరెడ్డి, పవన్, నారాయణ, సురేందర్, బాలు, అజయ్, సత్యం, విజయ్, రాజు, వివేక్ పాల్గొన్నారు.