జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు

జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు

ఖమ్మం టౌన్, వెలుగు :   ఖమ్మం జర్నలిస్టులకు ‘స్తంభాద్రి జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్’ బుధవారం స్థానిక ప్రెస్​క్లబ్​లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది.   సీనియారిటీ ప్రాధాన్యతతో సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కనకం సైదులు, బొల్లం శ్రీనివాస్ మాట్లాడారు. సొసైటీ నిబంధనల మేరకు వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుత అక్రిడిటేషన్ తో పాటు గత సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. జర్నలిస్టులు ఐక్యమత్యంతో త్వరగా ఇళ్ల స్థలాలు పొందాలని జర్నలిస్ట్ యూనియన్లు అభిప్రాయబడ్డాయి.

టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల రాంనారాయణ, టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పల్లా కొండలరావు, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల విషయంలో హౌసింగ్ సొసైటీకి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ సభ్యులు ఏనుగు వెంకటేశ్వరరావు, వెన్నబోయిన సాంబశివరావు, మైసా పాపారావు, బత్తుల వాసు, ఆలస్యం అప్పారావు, మాటేటి వేణుగోపాల్, నర్వనేని వెంకట్రావు, నలజాల వెంకట్రావు, చిర్రా రవి, సత్తుపాటి రామయ్య, సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.