
హైదరాబాద్, వెలుగు: తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని తుమ్మల పల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ చేతుల మీదుగా ఐ అండ్ పీఆర్ (హైదరాబాద్) ఫొటోగ్రాఫర్ కుంట్ల శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో స్పందన ఈద ఫౌండేషన్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఈద శ్యామ్యూల్ రెడ్డి, టీజేఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.