- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్రంలోని జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇండ్ల స్థలాలు ఇచ్చామని, రాబోయే రోజుల్లోనూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఇండ్ల స్థలాలు ఇచ్చేది కూడా తమ ప్రభుత్వమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. దశాబ్దకాలంగా పెండింగ్ లో ఉన్న ఇండ్ల స్థలాలు, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలో డిప్యూటీ సీఎంకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఇప్పుడు దశలవారీగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. వినతిపత్రం సమర్పించినవారిలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి, డిప్యూటీ సెక్రటరీ మందటి వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షుడు రామిశెట్టి విజేత, వనం నాగయ్య
మందుల ఉపేందర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రమేశ్, టెంజూ పట్టణ అధ్యక్షుడు యలమందల జగదీశ్, జిల్లా నాయకులు కొరకొప్పుల రాంబాబు, ముత్యాల కోటేశ్వరరావు, బిక్కి గోపి, టీఎస్ చక్రవర్తి, వెంకటకృష్ణ, తోట గణేశ్, సంతోష్, పిన్ని సత్యనారాయణ, ఈశ్వరి, వెంకటరెడ్డి, ఉత్కంఠం శ్రీనివాస్, పానకాల రావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో సన్మానం
ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సోమవారం గజమాలతో సన్మానించారు. పండిట్ పీఈటీల అప్ గ్రేడేషన్ కు, ప్రతి మండలానికీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపన, శిథిలావస్థకు చేరిన స్కూళ్ల డెవలప్మెంట్ కు కోట్లాది రూపాయల బడ్జెట్ కేటాయింపు,20 వేల ప్రమోషన్లతో టీచర్ల కలలను సాకారం చేసిన ప్రభుత్వానికి ఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సైదులు, టీచర్లు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.యాదగిరి, మన్సూర్, లీడర్లు వెంకన్న, శ్రీనివాసరావు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.