Journey To Ayodhya: రామాయణం ఆధారంగా మరో సినిమా.. ఈసారి వినూత్నంగా!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య మైథలాజికల్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆదిపురుష్, కార్తికేయ 2, హనుమాన్ వంటి సినిమాలు అలా వచ్చెనవే. ఇంకా చాలా సినిమాలు మేకింగ్ దశలో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో మరో సినిమా చేరింది. అదే జర్నీ టూ అయోధ్య(JourneyToAyodhya). శ్రీరామ నవమి సందర్బంగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. రామాయణ గాద ఆధారంగా వస్తున్న ఈ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం గోపించంద్ తో విశ్వం సినిమా చేస్తున్న చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ నిర్మాత వేణు దోనేపూడి జర్నీ టూ అయోధ్య సినిమాను నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు వీఎన్ ఆదిత్య కథ అందిస్తున్న ఈ సినిమాను ఓ యంగ్ దర్శకుడు తెరకెక్కిస్తారను సమాచారం. త్వరలోనే నటీనటుల వివరాలు కూడా ప్రకటించనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా గురించి నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ.. రామాయణపై ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. ఎంతో మంది గొప్ప వ్యక్తులు రామాయణ విశిష్టత గురించి మనకు వివరించారు. వాటికి ఏమాత్రం తగ్గకుండా మా జర్నీ టూ అయోధ్య సినిమా ఉంటుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన కాన్సెప్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.