కామారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోలుకు 16 సెంటర్లు

కామారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోలుకు 16 సెంటర్లు

కామారెడ్డి​, వెలుగు : జిల్లాలో జొన్నల కొనుగోలుకు 16 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు  మార్క్ ఫెడ్​ కామారెడి జిల్లా మేనేజర్ మహేశ్​​కుమార్ తెలిపారు.  క్వింటాల్​కు మద్దతు ధర రూ. 3,371 చెల్లిస్తామన్నారు.  మద్నూర్,  జుక్కల్, బిచ్​కుంద, ఆర్గొండ, కారేగావ్,  గాంధారి, పిట్లం,  పుల్కల్,  తిమ్మానగర్,  గుంకుల్, బోర్లం, పెద్దకొడప్​గల్, చిన్న కోడప్​గల్, ముదోలి, ఎల్లారెడ్డి, పద్మాజివాడిల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.