సూర్యాపేట, వెలుగు : యూనిఫైడ్ కౌన్సిల్ జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ లెవల్ సైన్స్ టాలెంట్‌సెర్చ్ ఎగ్జామినేషన్‌లో జయ ఐఐటీ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో 2,8,3,4,9,15,17, 20,27,29,29, 35,38,55,57, 84,87,91 ర్యాంకులు సాధించినట్లు ఆ పాఠశాల కరెస్పాండెంట్‌జయ వేణుగోపాల్ గురువారం తెలిపారు. 6వ తరగతి నుంచి స్టేట్8వ ర్యాంకు బి.రామ్‌సాయి,7వ తరగతి నుంచి ఆలిండియా 15వ ర్యాంకు బి.కార్తికేయ, ఆలిండియా 27వ ర్యాంకు వి.జయసూర్య, ఆలిండియా 85వ ర్యాంకు బి. సాయిచరణ్, ఆలిండియా 57వ ర్యాంకు వై.వీక్షణ సాధించారు.
8వ తరగతి నుంచి ఆలిండియా 55వ ర్యాంకు ఇ. సాయిదీక్షిత, ఆలిండియా 84వ ర్యాంకు పి.షన్ముకప్రత్యయ్, ఆలిండియా 87న ర్యాంకు కె.కార్తికేయ శ్రీవాత్సవ్, ఆలిండియా 91వ ర్యాంకు ఆర్.రమ్యానంద్ సాధించారు. 9వ తరగతి నుంచి ఆలిండియా 8వ ర్యాంకు జి.కావ్య, ఆలిండియా 17వ ర్యాంకు ఎస్‌కే రైహన్, ఆలిండియా 20వ ర్యాంకు ఆర్.సుహాస్, 10వ తరగతి నుంచి ఆలిండియా 29వ ర్యాంకు జి. శ్రీనిక, ఆలిండియా 29వ ర్యాంకు ఆర్.సుజిత్, ఆలిండియా 38వ ర్యాంకు జి. పవన్ సాధించారు. స్టేట్2వ ర్యాంకు ఎస్‌కే నేహసాయి, స్టేట్4వ ర్యాంకు పి.అనిరుధ్,స్టేట్9వ ర్యాంకు శివ రక్షిత సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.