Paris 2024 Paralympics : పారిస్‌‌లో పారాలింపిక్స్‌‌ సందడి షురూ

Paris 2024 Paralympics :  పారిస్‌‌లో పారాలింపిక్స్‌‌ సందడి  షురూ

పారిస్‌‌:  ఒలింపిక్స్‌‌ను విజయవంతంగా నిర్వహించిన పారిస్‌‌లో పారాలింపిక్స్‌‌ సందడి మొదలైంది.  ప్లేస్‌‌ డి లా కాంకోర్డ్‌‌లో బుధవారం ఓపెనింగ్ సెర్మనీ అంగరంగ వైభవంగా సాగింది. ఫ్రెంచ్‌‌ సంస్కృతి ఉట్టిపడేలా, ప్రాచీన కళలు ప్రతిబింబించేలా కళాకారులు చేసిన నృత్యాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. 140 మంది డ్యాన్సర్ల బృందం చేసిన అర్టిస్టిక్‌‌ షో ఆద్యంతం అలరించింది. కుంగ్‌‌ఫు డేర్‌‌డెవిల్‌‌ జాకీ చాన్‌‌ టార్చ్‌‌ బేరర్‌‌గా వ్యవహరించారు. అథ్లెట్ల పరేడ్‌‌లో ఇండియా టీమ్‌‌ తెల్లటి డ్రెస్‌‌ కోడ్‌‌లో మెరిసిపోయింది. 

జావెలిన్‌‌ త్రోయర్‌‌ సుమిత్‌‌ అంటిల్‌‌, భాగ్యశ్రీ జాదవ్‌‌ ఫ్లాగ్‌‌ బేరర్స్‌‌గా వ్యవహరించారు. ఫ్రెంచ్‌‌ మ్యాన్‌‌ థియో కురిన్‌‌ ట్యాక్సీ డ్రైవర్‌‌గా నటిస్తూ ఫ్రాన్స్‌‌ టీమ్‌‌ను స్వాగతించాడు. నాన్‌‌ జి నీ రెగ్రెట్టా రీన్‌‌ సాంగ్‌‌కు చేసిన పెర్ఫామెన్స్‌‌ ఫ్యాన్స్‌‌ను మంత్రముగ్దులను చేసింది. ఆ తర్వాత మస్కట్‌‌ స్టేజ్‌‌పైకి రావడంతో ఒక్కసారిగా కరతాళధ్వనులు ఆకాశాన్నంటాయి. అఫ్గానిస్తాన్‌‌ జట్టుతో అథ్లెట్ల పరేడ్‌‌ మొదలైంది. ఆ తర్వాత వరుస క్రమంలో మిగతా దేశాల అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు.