OTT Movies: భార్యని వదిలేసి ట్రాన్స్జెండర్ తో లవ్ లో పడిన హీరో.. చివరికి ఏం జరిగింది..?

OTT Movies: భార్యని వదిలేసి ట్రాన్స్జెండర్ తో లవ్ లో పడిన హీరో.. చివరికి ఏం జరిగింది..?

OTT Movies: ఈమధ్య ఓటీటీలు అందరికీ అందుబాటులోకి రావడంతో విదేశీ సినిమాలు కూడా దేశాలు దాటి ఆదరణ పొందుతున్నాయి.. అయితే పాకిస్తాన్ కి చెందిన "జాయ్ ల్యాండ్" సినిమా ప్రస్తుతం ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి పాక్ ప్రముఖ దర్శకుడు సైమ్ సాదిక్ దర్శకత్వం వహించగా అపూర్వ గురు చరణ్, సర్మద్ ఖూసత్, లారెన్ మాన్ తదితరులు కలసి సంయుక్తంగా నిర్మించారు. ఉర్దూ, పంజాబీ భాషల్లో 2022 నవంబర్  18న రిలీజ్ అయిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. 
 
అయితే జాయ్ ల్యాండ్ సినిమా స్టోరీ ఏమిటంటే..?

లాహోర్‌లో హీరో హైదర్ తన కుటుంబంతో కలసి ఉంటాడు. అయితే హైదర్ కి ఎలాంటి ఉద్యోగం లేకపోయినప్పటికీ తన తల్లిదండ్రుల పరపతిని చూసి మంచి అమ్మాయితో వివాహం జరుగుతుంది. అయితే పెళ్ళైన తర్వాత హైదర్ కి ఉద్యోగం లేకపోవడంతో తన కుటుంబ సభ్యులు, చుట్టుప్రక్కలవాళ్ళు హేళనచేయడం, అవమానించడం వంటివి చేస్తూ ఉంటారు. దీంతో హైదర్ ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోయి లైఫ్ లీడ్ చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు.. ఈ క్రమంలో తన ఏరియాలో బ్యూటీ సెలూన్ లో పనిచేసే ఖైజర్ అనే స్నేహితుడి ద్వారా బిబా అనే ట్రాన్స్ జెండర్ తో పరిచయం ఏర్పడుతుంది. దీంతో హైదర్ బిబాతో తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం, రాత్రిళ్ళు బైక్ పై రోడ్లపై తిరగటం వంటివి చేస్తుంటారు.. అయితే క్రమక్రమంగా హైదర్ కి తన భార్యపై ఫీలింగ్స్ తగ్గుతూ వస్తుంటాయి.. దీంతో ఆమెని దూరం పెడుతుంటాడు.. కానీ బిబా కి మాత్రం రోజురోజుకి దగ్గరవుతుంటాడు.. ఆ తర్వాత ఏం జరిగింది.? ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ALSO READ | ప్రియదర్శి "కోర్ట్" ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంత కలెక్ట్ చేసిందంటే..?

అయితే ఈ సినిమాలో రిలేషన్స్ మధ్యలో గ్యాప్ వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అంశాన్ని డైరెక్టర్ సైమ్ సాదిక్ బాగానే చూపించాడు. ముఖ్యంగా బీబా, హైదర్ మధ్య సన్నివేశాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయని చెప్పవచ్చ. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్, మధ్యమధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కూడా అలరిస్తాయి. ఓవరాల్ గా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమా అటు థియేటర్స్ లో, ఇటు  ఓటీటీలో కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ప్రస్తుతం జాయ్ ల్యాండ్ ప్రముఖ  ఓటీటీలయిన ప్రైమ్ వీడియో, ముబీ ఇండియాలో ప్రసారమవుతుంది.