న్యూఢిల్లీ : ఏసీసీ,అంబుజా సిమెంట్స్ కొనుగోలుతో భారతదేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా ఎదిగిన అదానీ గ్రూప్ మరో సిమెంట్ కంపెనీ కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జేపీ గ్రూప్‌కు చెందిన జైప్రకాశ్ సిమెంట్స్‌ను దక్కించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఏడాదికి 9 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సిమెంట్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ప్లాన్లను రెడీ చేస్తోంది.
ALSO READ : తెలంగాణ మార్కెట్లోకి టీవీఎస్ అపాచీ బ్లాక్ ఎడిషన్
జైప్రకాశ్ సిమెంట్స్‌పై దివాలా ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల ఆ కంపెనీకి చెందిన సిమెంట్, సున్నపురాయి, గనులు, పవర్ ప్లాంట్ వంటి అనుబంధ ఆస్తులను పొందేందుకు అవకాశం ఉంది. ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు గ్రూప్ ఇప్పటికే పని ప్రారంభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జైప్రకాశ్ కేసు గత నెలలో ఎన్సీఎల్టీకి వచ్చింది.