Cricket South Africa: ఇక దబిడిదిబిడే.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా ఏబీ డివిలియర్స్!

Cricket South Africa: ఇక దబిడిదిబిడే.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా ఏబీ డివిలియర్స్!

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ బాధ్యతల నుంచి ఆ జట్టు మాజీ క్రికెటర్ జెపి డుమిని తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డుమిని బోర్డుకు తెలియజేశాడు. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా(CSA) ధ్రువీకరించింది. వైట్‌బాల్ బ్యాటింగ్ కోచ్ పదవికి డుమిని రాజీనామా చేసినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది.

ALSO READ : Asian Cricket Council: జై షా స్థానంలో ఏసీసీకి కొత్త బాస్.. ఎవరీ షమ్మీ సిల్వా?

2004- 2019 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20లు ఆడిన డుమిని.. గతేడాది మార్చిలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. అతని కాలంలో దక్షిణాఫ్రికా జట్టు 2023 వన్డే ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌, 2024 టీ20 ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది.

తెరపైకి డివిలియర్స్ పేరు..!

బ్యాటింగ్ కోచ్‌గా డుమిని స్థానంలో ఆ జట్టు విధ్వంసకర క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పేరు తెరపైకి వస్తోంది. క్రికెట్ దక్షిణాఫ్రికా ఇప్పటికే అతన్ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అందుకు అతను అంగీకరించాడా లేదా అనేది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతానికి ఏబీ ఎలాంటి క్రికెట్ ఆడటం లేదు. ఐపీఎల్ సహా అన్ని ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉంటున్నాడు. ఐపిఎల్ 2024 కోసం మెంటార్‌గా ఆర్‌సీబీ జట్టులో చేరతాడనే వార్తలు వచ్చినప్పటికీ, అలాంటి భాధ్యతలేమీ అతను చేపట్టలేదు.