రాజధానికి డబ్బులిస్తే టీడీపీ  దోచేసింది... నడ్డా మనస్సు బాబు దగ్గర ఉంది..

 రాజధానికి డబ్బులిస్తే టీడీపీ  దోచేసింది... నడ్డా మనస్సు బాబు దగ్గర ఉంది..

బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా కామెంట్స్ కు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం పైన నడ్డా పలు ఆరోపణలు చేసారు. దీనికి స్పందించిన పేర్ని నాని....  సీఎం రమేష్..సత్యకుమార్..సుజనా మాటలను తన బుర్రలోకి ఎక్కించుకొని మాట్లాడితే అది వారి కర్మ అంట వ్యాఖ్యానించారు. కర్నూలు హైకోర్టు పెడతామనే బీజేపీ హామీ ఏమందైని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి గా ఉందని.. చంద్రబాబు పైన అవినీతి ఆరోపణలు చేసారని గుర్తు చేసారు.

 చంద్రబాబును ఫాలో అవుతున్న హరీష్ రావు 

తెలంగాణ మంత్రి హారీష్ రావు పైనా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. హరీష్ చంద్రబాబును ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేసారు. ఎన్టీఆర్ అమాయకుడు కాబట్టి బలయ్యారని..కేసీఆర్ తెలివిగల వ్యక్తి అని చెప్పుకొచ్చారు. అందుకే హరీష్ ను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచారన్నారు. 2018లో హరీష్ కు ఎందుకు కేబినెట్ లో స్థానం దక్కలేదని ప్రశ్నించారు. హరీష్ మామను చీకట్లో తిడతారని ఆరోపించారు. హరీశ్ కు ఏమి ఎక్కువో కేసీఆర్ కు బాగా తెలిసే దూరం పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు.

నడ్డా మనస్సు చంద్రబాబు దగ్గర..

 జేపీ నడ్డా మనసు చంద్రబాబు దగ్గర ఉందంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. చీకట్లో జరిగిన ఒప్పందం కారణంగానే ఇప్పుడు నడ్డా మాట మార్చారని మండిపడ్డారు. పేదలకు ఉచితంగా 2.16 లక్షల కోట్లను సీఎం జగన్ అందించారని చెప్పుకొచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇందులో సగం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.

బెంగుళూరులో జనం తిరస్కరించిన ప్రభుత్వం మీది కాదా అంటూ నిలదీసారు. టీడీపీ పూలతో ఏపీలో బీజేపీ నిండిపోయిందని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పీక కోద్దామనే ఆలోచన వెనుక భూ స్కాం ఉందనే అనుమానాలు ఉన్నాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎందుకు క్యాప్టివ్ మైన్ ఇవ్వరని ప్రశ్నించారు. బెంగళూరులో ప్రభుత్వం మారగానే డీజీపీని ఢిల్లీ తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు.

రాజధానికి డబ్బులిస్తే చంద్రబాబు దోచేశారు

 బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఏపీ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి పేర్ని నాని తిప్పి కొట్టారు. రాజధానికి డబ్బులిస్తే చంద్రబాబు దోచేశారని బీజేపీ నేతలే చెప్పారన్నారు. ఇసుక ఫ్రీ అంటూ టీడీపీ నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. ఇసుక డబ్బులు టీడీపీ, బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు.