
ఢిల్లీ లోని బీజేపీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు మోదీ... మోదీ అంటూ నినాదాలు చేశారు. . లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించిన తరువాత బీజేపీ అగ్రనేతలు కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. జేపీ నడ్డా మాట్లాడుతూ వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం చారిత్రాత్మకమైన తీర్పు అని నడ్డా అన్నారు. బీజేపీ గెలుపునకు కృషి చేసిన వారందరికి కృతఙ్ఞతలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్దిని కొనసాగిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడాబీజేపీ జండా రెపరెపలాడిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధించిందన్నారు. మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నామన్నారు. ఇండియా కూటమి చేసిన స్వార్థ పూరిత రాజకీయాలు ఫలించలేదన్నారు. . ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మోదీ హయాంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలపడిందన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతామన్నారు.