- గత ఒప్పందాల్ని సమీక్షించాలి: కూనంనేని, తమ్మినేని
హైదరాబాద్, వెలుగు: సౌర విద్యుత్ ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చారనే అభియోగాలపై అమెరికా కేసు నమోదు చేసిన నేపథ్యంలో అదానీపై జేపీసీ విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌లో సీపీఐ, సీపీఎం ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది.
కూనంనేని, తమ్మినేని మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పునర్విభజన చట్టంలో హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదానీతో గత రాష్ట్ర ప్రభుత్వం రూ.1,200 కోట్ల ఒప్పంద వివరాలపైనా సమీక్ష చేయాలన్నారు. లగచర్లలో బాధితులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.