- బీజేపీ ఎంపీ డీకే అరుణ
న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే పార్లమెంట్ సెషన్‌లో వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదిక సమర్పించనుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సవరణ బిల్లుపై అధ్యయనం- చివరి దశకు చేరుకుందని సోమవారం ఒక ప్రకటనలో ఆమె తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ అధ్యయనం వేగవంతంగా సాగుతోందని చెప్పారు. నివేదికలో పొందుపర్చాల్సిన కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో సోమ, మంగళవారాల్లో జరుగుతున్న జేపీసీ మీటింగ్‌లో బీజేపీ తరఫున డీకే అరుణ పాల్గొంటున్నారు.