Jr NTR: ఫ్యామిలీతో అమెరికా వెళ్లిన ఎన్టీఆర్..‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టే!

Jr NTR: ఫ్యామిలీతో అమెరికా వెళ్లిన ఎన్టీఆర్..‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టే!

దేవర (Devara) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‎లోని నోవాటెల్ హోటల్‎లో ఆదివారం (సెప్టెంబర్ 22న) జరగాల్సిన వేడుక రద్దు అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తిగా డిస్సపాయింట్ అయ్యారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సినిమా సోలో రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు.

దాదాపు 20 వేల మందికి పైగా అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో సెక్యూరిటీ చేతులేత్తేసింది.. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడంతో.. ఆ ఈవెంట్ కూడా నిర్వహించలేక చేతులెత్తేస్తూ క్షమాపణలు తెలిపారు నిర్మాణ సంస్థ. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కూడా తెలుగు ప్రమోషన్స్ ను పక్కన పెట్టేసి అమెరికా బయలుదేరాడు.

తాజాగా హీరో ఎన్టీఆర్ మరియు అతని భార్య ప్రణతితో కలిసి దేవర: పార్ట్ 1 స్క్రీనింగ్ బియాండ్ ఫెస్ట్ 2024లో పాల్గొనడానికి US బయలుదేరారు. అక్కడ జరిగే Beyond Fest, Hollywood Premiere కు ఈ బ్యూటీఫుల్ కపుల్ హజరుకానున్నారు. లాస్ ఏంజెల్స్‌లోని ఈజిప్షియన్ థియేటర్‌లో సెప్టెంబర్ 26న సాయంత్రం 6.30 గంటలకు ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. 

Also Read:-విజయ్ 'గోట్' సినిమా నటి పార్వతి నాయర్‌పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

అలాగే అక్కడ గ్రాండ్ గా ప్రమోషన్స్ నిర్వహించి ఈ నెల 27న ఉదయం హైదరాబాద్ రానున్నాడు ఎన్టీఆర్. ఇక దీంతో దేవర తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదనే తెలుస్తోంది. ఇక 'ఎన్టీఆర్ స్పీచ్..దేవర కథ.. ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హంగామా' ఇవన్నీటిని మిస్ అవుతుండడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆవేదానికి గురయ్యారు.

ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ అతని భార్య ప్రణతితో కలిసి ఉన్న ఎయిర్‌పోర్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జూనియర్ నలుపు రంగు చొక్కా మరియు నీలిరంగు జీన్స్ ధరించి కనిపించగా, ప్రణతి వైట్ టాప్ మరియు బ్లూ జీన్స్‌లో క్యాజువల్‌గా కనిపించింది.

కాగా..దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర: పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇకపోతే నిన్న సెప్టెంబర్ 22న దేవర రీలీజ్ ట్రైలర్ విడుదల చేయడంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.