దేవర (Devara) తొలి వీకెండ్‍లో భారీ వసూళ్లను దక్కించుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు గాను రూ.304కోట్లకి పైగాగ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు దేవర మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ వెల్లడించింది తెలిసిందే. అయితే,సెకండ్ వీక్ మొదలయిన ఫస్ట్ డే సోమవారం రోజు (సెప్టెంబర్ 30) దేవర కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.
Sacnilk బాక్సాఫీస్ ప్రకారం.. దేవర మూవీ కలెక్షన్లు సోమవారం దాదాపు 70 శాతం పడిపోయాయి. దేవర ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.12.5 కోట్ల నికర వసూలు సాధించింది. థియేటర్లలో విడుదలైన నాలుగు రోజుల తర్వాత దేవర పార్ట్ 1 మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు రూ. 173.1 కోట్లు. ఇకపోతే.. ఆదివారం సెప్టెంబర్ 29 నాటికి ఈ సినిమా రూ.40 కోట్లకు పైగా వసూలు చేసి మూడు రోజుల్లోనే రూ.161.06 కోట్లకు చేరుకుంది.
రోజు వారీగా దేవర బాక్సాఫీస్ రిపోర్ట్:: నెట్ కలెక్షన్స్
దేవర మూవీ థియేటర్లలో విడుదలైన మొదటి రోజు (సెప్టెంబర్ 27 శుక్రవారం) - రూ. 82.5 కోట్లు (తెలుగు: రూ. 73.25 కోట్లు, హిందీ: రూ. 7.5 కోట్లు, కన్నడ: రూ. 35 లక్షలు, తమిళం: రూ. 1 కోటి, మలయాళం: రూ. 40 లక్షలు)
2వ రోజు (శనివారం) - రూ. 38.2 కోట్లు (తెలుగు: రూ. 27.55 కోట్లు, హిందీ: రూ. 9 కోట్లు, కన్నడ: రూ. 35 లక్షలు, తమిళం: రూ. 1.05 కోట్లు, మలయాళం: రూ. 25 లక్షలు)
3వ రోజు (ఆదివారం) - రూ. 40.3 కోట్లు (తెలుగు: రూ. 27.7 కోట్లు, హిందీ: రూ. 11 కోట్లు, కన్నడ: రూ. 35 లక్షలు, తమిళం: రూ. 1.05 కోట్లు, మలయాళం: రూ. 25 లక్షలు)
4వ రోజు (సోమవారం) - రూ. 12.5 కోట్లు (తెలుగు: రూ. 8 కోట్లు, హిందీ: రూ. 4 కోట్లు, కన్నడ: రూ. 10 లక్షలు, తమిళం: రూ. 30 లక్షలు మరియు మలయాళం: రూ. 10 లక్షలు)
ALSO READ | Kalinga OTT: ఓటీటీలోకి తెలుగు మైథాలజీ థ్రిల్లర్ కళింగ
ఇక మొత్తం దేవర నెట్ కలెక్షన్స్ - రూ.173.1 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో రూ.200 కోట్ల క్లబ్ లో చేరబోతుంది.