దేవర మూవీకి టికెట్ల పెంపు..ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

దేవర మూవీకి టికెట్ల పెంపు..ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

దేవర సినిమాకి టికెట్ల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌ ధన్యవాదాలు తెలిపారు. దేవర మూవీ విడుదల కోసం కొత్త జీవోను ఆమోదించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞత తెలిపారు.

“దేవర రిలీజ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు, తెలుగు సినిమాకు మద్దతు కొనసాగిస్తున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‍కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‍కు కూడా థ్యాంక్స్ చెబుతున్నా” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో దేవర సినిమా కోసం అదనపు షోలకు, తొలి రోజైన సెప్టెంబర్ 27న ఆరు షోలకు గ్రీన్‍ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్టీఆర్ మరియు దేవర మేకర్స్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. 

ధరలు ఎంత పెరిగాయంటే.. 

ఇవాళ శనివారం (సెప్టెంబర్ 21)  దేవర సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‍లోని మల్టీప్లెక్స్‌ థియేటర్లలో దేవర సినిమాకు సంబంధించిన ఒక్కో టికెట్‍పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు మూవీ టీమ్‍కు ఏపీ సర్కార్ ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్‍లలో బాల్కనీ టికెట్‍పై అదనంగా రూ.110, లోయర్ క్లాస్‍ టికెట్‍పై రూ.60 అధికం చేసేందుకు అనుమతి ఇచ్చింది.

ALSO READ | Devara Ticket Prices: దేవర టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఫస్ట్ డే అర్థరాత్రి షో..అదనపు షోలు కూడా

సెప్టెంబరు 27 నుండి 9 రోజుల పాటు అనగా అక్టోబరు 5వరకు ప్రతిరోజు 5 స్పెషల్ షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే కేవలం 27 తేదీన ఒక్క రోజు మాత్రమే 6 షోలు ప్రదర్శించుకునేలా ఉత్త్వరులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఆ రోజున అర్ధరాత్రి 12 గంటలకే తొలి షో పడనుంది.

రెండో రోజు నుంచి మరో తొమ్మిది రోజులు ప్రతీ రోజు 5 షోలు ప్రదర్శించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇక రెండు వారాల వరకు టికెట్లపై అదనపు ధరలు ఉంచుకోవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.