దేవర సినిమాకి టికెట్ల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ధన్యవాదాలు తెలిపారు. దేవర మూవీ విడుదల కోసం కొత్త జీవోను ఆమోదించినందుకు "గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంతటి మద్దతు ఇస్తున్నందుకు నేను రుణపటి ఉంటాను" అని సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞత తెలిపారు.
My heartfelt thanks to the Honourable CM, Sri @revanth_anumula garu, and Cinematography Minister, Sri @KomatiReddyKVR garu, for issuing the new G.O. for the #Devara release. Grateful for your unwavering support for our Telugu Film Industry!
— Jr NTR (@tarak9999) September 23, 2024
ఈ నేపథ్యంలో దేవర సినిమా కోసం అదనపు షోలకు, తొలి రోజైన సెప్టెంబర్ 27న ఆరు షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్టీఆర్ మరియు దేవర మేకర్స్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
Thanks to the Government of Telangana, Honourable CM Sri @revanth_anumula
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) September 23, 2024
Garu, and Cinematography Minister, Sri @KomatireddyKVR Garu, for issuing the new G.O. for the #Devara release. Gives us a massive boost ahead of our film's release.
Always thankful for your continued…
ధరలు ఎంత పెరిగాయంటే..
దేవర సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం (సెప్టెంబర్ 23) అనుమతులు ఇచ్చింది. అదనపు షోలకు ఓకే చెప్పింది. ఫస్ట్ డే సెప్టెంబర్ 27న దేవర సినిమా ఒక్కో టికెట్‍పై రూ.100 అదనంగా ధర పెంచేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత తొమ్మిది రోజులు.. 'సెప్టెంబరు 27 నుండి 9 రోజుల పాటు అనగా అక్టోబరు 5వరకు' ప్రతిరోజు తెలంగాణవ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‍పై రూ.50, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‍పై రూ.25 రేటును పెంచుకునేందుకు ఓకే చెప్పింది.
Also Read:-తెలంగాణ, ఏపీలో దేవర టికెట్ ధరలు
తెలంగాణవ్యాప్తంగా దేవర ఫస్ట్ షో ఉదయం 4 గంటల నుంచి ఆరు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రెండో రోజు నుంచి పదో రోజు వరకు.. ప్రతీ రోజు ఐదు షోలకు మాత్రమే ఓకే చెప్పింది. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో అర్ధరాత్రి 1 గంట షోకు మాత్రం 29 థియేటర్లకే తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.
కాగా సింగిల్ స్క్రీన్ లో పెద్ద హీరోలకు ఉండే బాల్కనీ టికెట్ ధర రూ. 175- ఇప్పుడు దేవర సినిమాకి రూ. 295/-గా ఉంది. రూ.110 ల టికెట్ ధర - రూ.235 గా ఉంది. రూ.80 ల టికెట్ ధర రూ.150 గా ఉంది.
ఇకపోతే మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో నార్మల్ గా రూ.295/- ఇప్పుడు దేవర సినిమాకి రూ.410 గా ఉంది. రిక్లైనర్ హయ్యెస్ట్ రూ.475 గా ఉంది.
మల్టీప్లెక్స్ లలో గరిష్ఠంగా రూ.413 నుంచి రూ.475 గా ఉంది. సింగిల్ స్క్రీన్లలో రూ.295 నుంచి 150 గా పరిమితి విధించారు. అయితే, ఫస్ట్ డే మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయి. ఇక రెండో రోజు నుంచి మల్టీప్లెక్స్ లలో గరిష్ఠంగా రూ.354, సింగిల్ స్క్రీన్లలో రూ.206 రేట్లు అమలు చేయనున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ లాస్ ఏంజెల్స్ ఉన్నాడు. అక్కడి బియాండ్ ఫెస్ట్ 2024లోనే దేవర వరల్డ్ ప్రీమియర్ షో వేయనున్నారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కోసం అతడు ఫ్యామిలీతో అక్కడికి వెళ్లాడు.