JR NTR : ఓల్డ్ కోల్‌‌కతా బ్యాక్‌‌డ్రాప్‌‌లో.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌‌ మూవీ

JR NTR : ఓల్డ్ కోల్‌‌కతా బ్యాక్‌‌డ్రాప్‌‌లో.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌‌ మూవీ

గతేడాది ‘దేవర’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్..  ప్రస్తుతం  హిందీలో హృతిక్ రోషన్‌‌తో కలిసి   ‘వార్‌‌‌‌2’ చిత్రంలో  నటిస్తున్నాడు. ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌‌తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా, ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే  ఈ నెలాఖరున మొదలుపెడుతున్న ఫస్ట్ షెడ్యూల్‌‌లో ఎన్టీఆర్ లేకుండా కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారట. 

మార్చి నుంచి ఎన్టీఆర్ సెట్‌‌లో జాయిన్ అవనున్నాడని తెలుస్తోంది.  ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌‌ సిటీలో ఓల్డ్‌‌ కోల్‌‌కతా బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఓ స్పెషల్   సెట్‌‌ను రెడీ చేస్తున్నారు.  పీరియాడిక్ జానర్‌‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌‌ డిఫరెంట్ లుక్‌‌లో కనిపించబోతున్నాడట. రుక్మిణీ వసంత్‌‌ హీరోయిన్‌‌గా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి ఈ  చిత్రాన్ని  నిర్మిస్తున్నాయి.  వచ్చే ఏడాది సంక్రాంతికి  సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  ప్రశాంత్‌‌ నీల్‌‌ రూపొందించనున్న ఈ మూవీ సైతం రెండు భాగాలుగా వస్తుందనే టాక్ వినిపిస్తోంది.