NTRNeel: అఫీషియల్: ఎన్టీఆర్-నీల్ మూవీ బిగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. గ్లింప్స్ కూడా

NTRNeel: అఫీషియల్: ఎన్టీఆర్-నీల్ మూవీ బిగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. గ్లింప్స్ కూడా

ఎన్టీఆర్.. నీల్ (NTRNeel) కాంబోపై ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.

NTR 31(డ్రాగన్) ప్రచారంలో ఉన్న వర్కింగ్ టైటిల్. ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా (మే 20న) గ్లింప్స్ రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు.

ఇటీవలే (ఏప్రిల్ 22న) ఎన్టీఆర్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ లేకుండా ముందుకెళ్లనుంది. అయితే, 2025 జనవరి మూడో వారంలో మంగళూర్లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ అయ్యింది. కానీ, ఆ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. మిగతా నటులతో నీల్ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాడు. ఇక ఏప్రిల్ 22న నుంచి ఎన్టీఆర్ ఆగమనంతో.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 

NTR31 మూవీని ఎన్టీఆర్‌‌‌‌ ఆర్ట్స్‌‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌‌ సంస్థ నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నట్లు టాక్. అయితే, మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

సినిమా కథ విషయానికి వస్తే.

ఇది1960ల కాలంలో జరిగిన కథగా రానుందని సమాచారం. గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో మాదకద్రవ్యాల వ్యాపారాన్ని నియంత్రించిన చైనీస్ గ్యాంగ్‌స్టర్ జావో వీ జీవితం ఆధారంగా తెరకెక్కునున్నట్లు టాక్ ఉంది. ఇందులో ఎన్టీఆర్ ఒక మాఫియా డాన్ పాత్రలో నటించబోతున్నాడట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సిగ్నేచర్ స్టైల్‌కు అనుగుణంగా, తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలతో కూడిన హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని సమాచారం. మే 20న రానున్న గ్లింప్స్ తో క్లారిటీ వచ్చే అవకాశముంది.