JrNTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ..ప్ర‌శాంత్ నీల్ నుంచి బ్లాస్ట్య్యే అప్డేట్.!

జూనియర్ ఎన్టీఆర్ తో  కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఇక అప్పటినుండి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ, ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. కారణం..ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు ఆలస్యం అవడమే. మరోపక్క దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ తో సలార్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ 31 గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఆ కారణంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.

అయితే..తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ 31 నుండి త్వరలోనే అదిరిపోయే అప్డేట్ రానుందట. ఈనెల (ఆగస్ట్9న) ఎన్టీఆర్ 31 మూవీ పూజా కార్యక్రమంతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇందుకోసం కొత్త ఆఫీసు కూడా ఓపెన్ చేసే పనిలో ఉన్నారట మైత్రీ మూవీస్ నిర్మాతలు. మరి రెండ్రోజుల్లో కొత్త ఆఫీసులో ఓపెనింగ్ వుంటుందో లేక వేరే చోట పూజా ఈవెంట్ వుంటుదో క్లారిటీ అయితే రాలేదు. కాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. మరీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుండి షురూ కానుందో మరో రెండ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read :- హై వోల్టేజ్ యాక్షన్తో వస్తోన్న విశ్వక్ సేన్

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ ప్రాజెక్టు నుండి ఇప్పటికే విడుదలైన ఒక పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఎన్టీఆర్ హీరోయిజం,ఎలివేష‌న్స్ పీక్స్‌లో ఉండబోతున్న ఈ సినిమాకు 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్ను ఫిక్స్ చేశాడట నీల్.ఈ సినిమాలో ఫుల్ మాసివ్ రోల్ లో కనిపించబోతున్న తారక్ కు లుక్, క్యారెక్ట‌రైజేష‌న్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ మూవీకి డ్రాగ‌న్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాల‌ని ప్రశాంత్ నీల్ డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.