Jr NTR: వరద భీభత్సం ఎంతగానో కలచివేసింది..తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ విరాళం

Jr NTR: వరద భీభత్సం ఎంతగానో కలచివేసింది..తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ విరాళం

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (NTR) వరుసగా సినిమాలు చేస్తూనే సామాజిక సేవ కూడా చేస్తుంటాడు. తాజాగా ఎన్టీఆర్ మరోసారి తన హుదారతను చాటుకున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఆస్థి ప్రాణ నష్టం చాలా వరకు జరిగింది. కొన్ని చోట్ల ప్రజలు తమ ఆవాసాలను కోల్పోయారు. తినడానికి తిండి తాగటానికి మంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. తాజాగా ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు సాయాన్ని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. 

"రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను" అని ఎన్టీఆర్ ట్విట్టర్ X లో పోస్ట్ చేశారు.

దీంతో ఎన్టీఆర్ పై తెలుగు రాష్ట్రాల అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక మిగతా తెలుగు హీరోలు కూడా తమ వంతు సాయాన్ని ప్రకటించాలని సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

ఇప్పటికే ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ రేపటి కోసం అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు.

హీరో విశ్వక్ సేన్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా రూ.5 లక్షలు విరాళం ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు.ఇటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు  5 లక్షలు విరాళం అందించాడు.