యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ దేవర (Devara) రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. స్టార్ డైరెక్టర్ శివ కొరటాల (Shiva Koratala) పాన్ ఇండియాలో స్థాయిలో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు.
ఈ సినిమా వరల్డ్ వైడ్గా మొదటి మూడు రోజులకు గాను గ్రాస్ రూ. 304 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించినట్లు దేవర మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ వెల్లడించారు. అంతేకాకుండా ప్రీరిలీజ్ బిజినెస్ లో ఆల్మోస్ట్ 70 % రికవరీ కూడా సాధించడంతో దేవర లాభాల్లోకి వెళ్లడం కన్ఫమ్ అని ట్రేడ్ వర్గాల టాక్.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్లో జోష్ పెంచడానికి ఓ భారీ సక్సెస్ ఈవెంట్ను మేకర్స్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో డిస్సప్పాయింట్ లో ఉన్న ఆడియన్స్ కోసం గ్రాండ్ సక్సెస్ మీట్ తో కృతజ్ఞతలు చెప్పాలని ప్లాన్ చేస్తున్నారట.
తెలుగులో దేవర రిలీజ్ కు ముందు ఎలాంటి ఫంక్షన్ గానీ, ఎన్టీఆర్ ఆడియన్స్ ముందుకు వచ్చి మాట్లాడింది గానీ లేదు. అయినా దేవర సినిమాకు బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ తో ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండటంతో భారీ సక్సెస్ మీట్ నిర్వహించాలని నిర్మాతలతో పాటు డైరెక్టర్ కొరటాల, డిస్ట్రిబ్యూటర్లు నాగవంశీ, దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.
Also Read : నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
అయితే, ఈ గ్రాండ్ ఈవెంట్ ను బుధవారం అక్టోబరు 2న నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్. కాగా ఈ సారి దేవర గ్రాండ్ సక్సెస్ మీట్ ను రామోజీ ఫిల్మ్ సిటీ లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న ఈ రెండ్రోజుల్లో సక్సెస్ మీట్ ఫంక్షన్ పై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.