
గత కొద్దిరోజులుగా ‘దేవర’ చిత్రం జపనీస్ వెర్షన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఈసారి జపాన్ ట్రిప్ తనకు ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయిందన్నాడు. అందుకు కారణం అక్కడ ఓ అమ్మాయి.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చూసి తెలుగు నేర్చుకున్నానంటూ తెలుగులో మాట్లాడి తారక్‌ను సర్ ప్రైజ్ చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎన్టీఆర్.. "నా జపాన్ విజిట్ నాకెప్పుడూ అందమైన జ్ఞాపకాలను ఇస్తుంది. కానీ ఈ సందర్శన పూర్తి భిన్నంగా ఉంది. ఒక జపనీస్ అభిమాని RRR చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పడం విని నిజంగా నన్ను కదిలించింది.
సినిమా మీద ఉన్న తన అభిమానం, తనను తెలుగు భాషను నేర్చుకునే ప్రేమికురాలుగా మార్చింది. సినిమా, భాషా ప్రేమికుడిగా నేనెప్పటికీ మర్చిపోలేను విషయం" అని ఎన్టీఆర్ X వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
My visits to Japan always give me beautiful memories but this one hit differently. Hearing a Japanese fan tell me she learned Telugu after watching RRR truly moved me.
— Jr NTR (@tarak9999) March 27, 2025
Being a lover of cinema and languages, the power of cinema to be a bridge across cultures and encouraging a… pic.twitter.com/4bQ1v8ZZP8