మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర (Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా గ్రాండ్ గా రేపు (సెప్టెంబర్ 27న) వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్కి సిద్దమయ్యింది. అయితే, ఈ సినిమా రిలీజ్కు ముందే భారీ స్థాయిలో వ్యూస్, ఓవర్సీస్ ప్రీ సేల్స్, ఇండియా అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డులు నెలకొల్పింది.
కాగా దేవర ఒవర్సీస్ ప్రీ సేల్స్ మిలియన్ వ్యూస్ రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, FIJI మరియు PNG ప్రీ సేల్స్ లో దూసుకెళ్తోంది. అలాగే టికెట్స్ పరంగా దేవర రికార్డు సృష్టించింది..USA ప్రీమియర్‌ల కోసం గురువారం నాటికి దేవర 75000 నుంచి 1,00,000 టిక్కెట్లు ప్రీ-సేల్స్‌తో టిక్కెట్లు విక్రయించడంతో రాంపేజ్ మొదలెట్టేసింది.
ఇక ఉత్తర అమెరికాలో 2.5కి పైగా మిలియన్ డాలర్ల మార్కును దాటింది. అంతేకాకుండా దేవర సినిమా ఇప్పటివరకు ప్రీమియర్ల ద్వారా వచ్చిన మొత్తం: $2.4M, డే1 $600K కలెక్ట్ చేసి మొత్తంగా M మార్క్ ను అందుకుంది. ప్రస్తుతం అత్యధిక ప్రీమియర్స్ గ్రాస్ రాబట్టిన సినిమాలలో ఆల్ టైమ్ టాప్-3 లో దేవర కొనసాగుతోంది.
NORTH AMERICA is bleeding RED…🔥#Devara pic.twitter.com/aAR1GErCjJ
— Devara (@DevaraMovie) September 26, 2024
ఇకపోతే సెప్టెంబర్26న గ్రాండ్ ప్రీమియర్స్లో రిలీజ్ కానుంది దేవర. ఇప్పటికే, మూడు మిలియన్స్ రాబట్టిన దేవర ఫస్ట్ వీకెండ్ నాటికి $5 మిలియన్ రాబట్టే అవకాశం ఉంది. RRR తరువాత జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ప్రీ సేల్స్ ద్వారా 2 మిలియన్ డాలర్లు దాటిన సినిమా హీరోగా నిలిచాడు. వరుసగా రెండు సినిమాలకు ఈ స్థాయిలో సేల్స్ సాధించడం ఎన్టీఆర్ కు ప్రత్యేకతగా నిలిచింది.
The Rampage begins with 75,000+ Tickets SOLD for USA Premieres 🔥🔥
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 25, 2024
All set to annihilate the box office like never before! 💥💥
Prepare for an earth shattering experience from tomorrow! ❤️🔥❤️🔥#DevaraUSA by @PrathyangiraUS @Hamsinient#Devara pic.twitter.com/zyrOw7wASF
ఇలా ప్రతిచోటా..టికెట్స్ బుకింగ్స్ విషయంలోనూ దేవర తనడైన సత్తా చాటుతూ ఇదివరకు రికార్డులు నెలకొల్పిన మూవీస్ ను క్రాస్ చేస్తూ స్టామినా చూపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా మీద ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. దీనివల్ల మొదటి రోజు, వారాంతంలో భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరికొన్ని గంటల్లో రాబోయే దేవర దర్శనంతో.. మరెలాంటి రికార్డులు నెలకొల్పనుందో చూడాలి.