Devara Box Office: దేవర మూడు రోజుల కలెక్షన్ల లెక్కలు.. గ్రాస్ ఎంత.. నెట్ ఎంత?

Devara Box Office:  దేవర మూడు రోజుల కలెక్షన్ల లెక్కలు.. గ్రాస్ ఎంత.. నెట్ ఎంత?

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  దేవర (Devara) సినిమా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.243 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది తెలిసిందే. ఇక దేవర మూడు రోజులకు గాను గ్రాస్ రూ. 304కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించినట్లు దేవర మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ వెల్లడించారు. ఇకపోతే మూడు రోజులకు గాను దేవర గ్రాస్, నెట్ కలెక్షన్స్ ఎంత సాధించాయి ? డే 1 నుంచి డే 3 బాక్సాఫీస్ నెట్ కలెక్షన్ల లెక్కలు ఎలా ఉన్నాయో లుక్కేద్దాం. 

దేవర నెట్ కలెక్షన్స్::

Sacnilk బాక్సాఫీస్ ప్రకారం.. దేవర 3రోజుల వరల్డ్ వైడ్ గా రూ. 150 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసి.. బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఆదివారం సెప్టెంబర్ 29 నాటికి ఈ సినిమా రూ.40 కోట్లకు పైగా వసూలు చేసి మూడు రోజుల్లోనే రూ.161.06 కోట్లకు చేరుకుంది.

దేవర మూవీ థియేటర్లలో విడుదలైన మొదటి రోజు (సెప్టెంబర్ 27 శుక్రవారం) - రూ. 82.5 కోట్లు (తెలుగు: రూ. 73.25 కోట్లు, హిందీ: రూ. 7.5 కోట్లు, కన్నడ: రూ. 35 లక్షలు, తమిళం: రూ. 1 కోటి, మలయాళం: రూ. 40 లక్షలు)

2వ రోజు (శనివారం) - రూ. 38.2 కోట్లు (తెలుగు: రూ. 27.55 కోట్లు, హిందీ: రూ. 9 కోట్లు, కన్నడ: రూ. 35 లక్షలు, తమిళం: రూ. 1.05 కోట్లు, మలయాళం: రూ. 25 లక్షలు)

3వ రోజు (ఆదివారం) - రూ. 40.3 కోట్లు (తెలుగు: రూ. 27.65 కోట్లు, హిందీ: రూ. 11 కోట్లు, కన్నడ: రూ. 35 లక్షలు, తమిళం: రూ. 1.05 కోట్లు, మలయాళం: రూ. 25 లక్షలు)

ఇక మొత్తం దేవర నెట్ కలెక్షన్స్ - రూ.161.06 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో రూ.200 కోట్ల క్లబ్ లో చేరబోతుంది. 

దేవర గ్రాస్ కలెక్షన్స్::

అయితే.. దేవర మూవీకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా రూ.172 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా దేవరకు రూ.71 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి రూ.243 కోట్లకి చేరింది.

అంటే ఏకంగా ఫస్ట్ డేతో పోలిస్తే రెండో రోజు రూ.101 కోట్లు తక్కువగా వచ్చాయి. ఇక మూడో రోజు గ్రాస్ లెక్కలు రూ. 304కోట్లకి పైగా సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు.

తెలుగుతో పాటు హిందీలోనూ ఆదివారం బుకింగ్స్ ట్రెండ్ బాగానే కనిపించింది. తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ మూవీ పర్వాలేదనిపిస్తోంది. ముఖ్యంగా హిందీలో ఈ మూవీకి కలెక్షన్లు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో దేవర కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.