టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) మాస్ ఎంటర్టైనర్ దేవర(Devara) థియేటర్లో సందడి షురూ అయింది. స్టార్ డైరెక్టర్ శివ కొరటాల(Shiva Koratala) తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా నేడు శుక్రవారం (సెప్టెంబర్ 27) మిడ్‌నైట్ షోస్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో దేవర ప్రభంజనం మొదలైంది. ఎక్కడ చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. దేవర ఆగమనం అదిరిపోయిందని ప్రీమియర్స్ చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
దేవర ఫస్ట్‌డే టార్గెట్::
ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసి రెండు విభిన్నమైన పాత్రల్లో అదరగొట్టాడని అంటున్నారు. 'దేవర-వర'తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ యాక్టింగ్, క్యారెక్టర్స్‌లో చూపించిన వేరియేషన్ అద్భుతమంటూ ఫ్యాన్స్ చెబుతోన్నారు. అయితే, ఈ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్::
ALSO READ : Devara Twitter X Review: దేవర ట్విట్టర్ X రివ్యూ.. ప్రీమియర్స్‌కు పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
కాగా దేవర రిలీజ్ కు ముందే ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసిందని సమాచారం. అయితే, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దేవర మూవీ రూ.26 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఓవర్‌సీస్‌తో కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమా 42 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతోన్నారు. ఇక ఈ సినిమాకు వస్తోన్న పాజిటివ్ టాక్ ను బట్టి మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.