దేవర (Devara) మూవీ బాక్సాఫీస్ సక్సెస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. దీంతో మా అభిమాన హీరో సినిమాకి..బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏ స్థాయిలో వచ్చాయనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఆ వివరాల్లోకి వెళితే..
దేవర మూవీ రిలీజ్ కు ముందే.. ఇండియా ఓవర్సీస్ లో ఇలా.. ప్రతిచోటా ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే పలు రికార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా రూ.77కోట్లు వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయి. అయితే, ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇండియాలో వచ్చిన కలెక్షన్లలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువగా రూ.68 కోట్లుకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read :- రియల్ లైఫ్ పాత్రలో సాయిపల్లవి
ఈ రూ.77 కోట్ల కలెక్షన్స్‌లలో తెలుగు నుంచి రూ.68.6 కోట్లు, హిందీ నుంచి రూ.7 కోట్లు, కన్నడ నుంచి రూ. 30 లక్షలు, తమిళం ద్వారా రూ. 80 లక్షలు, మళయాళం వెర్షన్‌లో రూ. 30 లక్షలు వచ్చాయి. అలాగే, దేవర పార్ట్-1కు శుక్రవారం 79.56 శాతం తెలుగులో థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది.
కల్కి కంటే తక్కువే:
అయితే.. దేవర సినిమాకి పలుచోట్ల మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ..వరల్డ్ వైడ్ గా టాప్ డే 1 వసూళ్లలో నిలిచింది. ఒకపరంగా చూసుకుంటే ఇది గ్రాండ్ ఓపెనింగ్ అయినప్పటికీ.. ప్రభాస్ కల్కి 2898 AD మూవీ కంటే వెతక్కువే అని ట్రేడ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా కల్కి మూవీ ఫస్ట్ డే .వరల్డ్ వైడ్ గా రూ.191.5 కోట్లు రాబట్టింది. ఇక ఈ వీకెండ్ లో దేవర మరింత థియేటర్ ఆక్యుపెన్సీ నమోదై అవకాశం ఉంది.