మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర(Devara).స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)అందించబోయే సంగీతంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ లెవల్లో అంచనాలు పెట్టేసుకున్నారు. మే 17న రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఫియర్ ప్రోమోతోనే వెన్నులో వణుకు పుట్టించేశాడు అనిరుధ్.
ఎన్టీఆర్ పుట్టిన రోజుకు (మే 20) ఒక్కరోజు ముందుగానే దేవర నుంచి ఫియర్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రీ (Ramajogaiah Sastry) లిరిక్స్ అందించగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరపరచి పాడారు.దయ లేని దేవర మౌనం..సవరణ లేని హెచ్చరిక అంటూ ఈ సాంగ్ తో కొరటాల మార్క్ ని చూపించారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ సముద్రంలో బోట్ పై అలా వస్తుంటే రెండు కళ్ళు చాలవన్నట్లుగా స్టన్నింగ్ లుక్స్ అదిరిపోయాయి.
ప్రతి ఒక్కరిలో భయాన్ని రేపే దేవర..భారీ అలల మధ్య ఎత్తుగా నిలబడి..అతను కలిగించే భయమే అతని పాదాల క్రింద ఏదైనా ఆయుధంగా మారుతుందని విషయాన్నీ..చాలా చక్కగా ఈ సాంగ్ లోని ప్రతి పంక్తిని బ్లేడ్ లాగా రూపొందించారు గీత రచయిత రామ జోగయ్య శాస్త్రీ. అగ్గంటుకుంది సంద్రం..భగ్గున మండె ఆకసం వంటి పదాలే అందుకు ఉదాహరణ అని చెప్పొచ్చు.
ఇక అనిరుధ్ తన బిజిమ్తో, తన స్వరంతో వణుకిస్తున్నారు. మొత్తానికి అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ సౌండ్ బీట్,రామజోగయ్య శాస్రి లిరిక్స్, అనిరుధ్ ఇంటెన్స్ వాయిస్ తో ఫియర్ సాంగ్ మోత దద్దరిల్లింది.ఇక ఈ సాంగ్ తో రజినీకాంత్ జైలర్ హుకుమ్ సాంగ్ పేరు మీదున్న రికార్డ్ బ్రేక్ చేయడం కన్ఫమ్. ఆలస్యం ఎందుకు ఫియర్ సాంగ్ కోసం మీ వూఫర్‌ని సిద్ధంగా ఉంచుకోండి. దేవర ఫ్యాన్స్ ప్రేమ ఎంత..సముద్రమంత అని ప్రూవ్ చేసేయండి.
నిజానికి దేవరకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు అని తెలిసినప్పటినుండి ఈ సినిమా రేంజ్ మారిపోయింది.కారణం..అనిరుధ్ నుండి వచ్చిన గత చిత్రాలే. ఆయన మ్యూజిక్ అందించిన విక్రమ్,లియో,జైలర్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేశాయి. అందుకే..దేవర కోసం అనిరుధ్ అందించబోయే మ్యూజిక్ పై భారీ అంచనాలను ఫియర్ సాంగ్ రెట్టింపు చేసింది.ఇక పూర్తి ఎలా వుండబోతుందనే అంచనాలు మొదలు పెట్టేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.