Devara OTT: కళ్లు చెదిరే ధరకు దేవర ఓటీటీ రైట్స్!.. స్ట్రీమింగ్ అయ్యేది ఆ పండుగకే?

Devara OTT: కళ్లు చెదిరే ధరకు దేవర ఓటీటీ రైట్స్!.. స్ట్రీమింగ్ అయ్యేది ఆ పండుగకే?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటించిన దేవర(Devara) హైవోల్టేజ్ యాక్షన్తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దేవర ఎర్ర సముద్రం థియేటర్లో ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. దాంతో ఈ వీకెండ్‍లో ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకు గాను రూ.304కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి దేవర రెండో స్థానంలో నిలిచింది. ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రానుంది? ఎక్కడ స్ట్రీమింగ్ కానుందనే వివరాల్లోకి వెళితే.. 

దేవర మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ రూ.155 కోట్లు వెచ్చించి మరి అన్ని భాషల హక్కుల్ని సొంతం చేసుకుందని సమాచారం. ఈ మూవీ కోసం  ఎన్నో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడగా ఆఖరుకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని ఇన్‌సైడ్ టాక్. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దేవర సినిమాకు ఓటీటీ, శాటిలైట్, థియేటర్స్ అన్ని కలిపి రూ.400 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. 

ALSO READ | Devara Box Office: దేవర మూడు రోజుల కలెక్షన్ల లెక్కలు.. గ్రాస్ ఎంత.. నెట్ ఎంత?

ఇకపోతే దేవర సినిమాను థియేటర్లలో రిలీజైన (సెప్టెంబర్ 27) నుంచి 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంటే, కచ్చితంగా 8 వారాల తర్వాత దేవర ఓటీటీలోకి రానుందన్నమాట. అయితే, నవంబర్‌లో దీపావళి కానుకగా డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారనే టాక్ ఐతే వినిపిస్తోంది. 

ఇక దేవర సినిమాను అన్ని భాషలలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారనేది ప్రస్తుతానికి ఉన్న టాక్ మాత్రమే. అయితే, దేవర ఓటీటీ రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఇప్పటికీ మేకర్స్, నెట్‌ఫ్లిక్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సో.. దేవర థియేటర్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అవ్వగానే ఓటీటీపై అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.