ఎన్టీఆర్ (Ntr), జాన్వీ కపూర్(Janhvi Kapoor)ల రొమాంటిక్ గీతం 'చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు' సాంగ్ రిలీజై శ్రోతలను ఆకట్టుకుంటోంది. వినే కొద్దీ ఈ మెలోడియస్ సాంగ్ మెస్మరైజ్ చేస్తోంది.ఆ జంట కన్నుల పంట..మాధుర్యపు తూగుటుయ్యాల' అంటూ సాగిన ఈ రొమాంటిక్ పాటకు సరస్వతి పుత్ర రామ జోగయ్య శాస్ట్రీ లిరిక్స్ అందించగా శిల్ప రావు పాడారు.
లైఫ్లో తన రాజకుమారుడి రాక కోసం కలలు కనే ప్రతి అమ్మాయి మనసులోని భావాలను..రాంజో తన సాహిత్యంలో పొందుపరిచాడు. ఈ అందమైన పదాల అమరికలు అనిరుధ్ ఇచ్చిన బాణీ మైమరిపిస్తోంది. ఇక ఇలాంటి పాటలోని పదాలను వినేయాలని, చూడాలని ఉంటుంది కదా..అందుకే మీ కోసం ఆ లిరిక్స్ చూసి హమ్ చేయండి. అయితే, ఈపాట వింటోన్న శ్రోతలకు తారక్, జాన్వీ కెమెస్ట్రీ చూసి..ఒకప్పటి ఎన్టీఆర్, శ్రీదేవి జోడి గుర్తుకు వస్తోందంటూ కొందరు కామెంట్ చేయడం విశేషం.
లిరిక్స్ ఇవే..
పల్లవి
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాస్సేపు
అస్తమానం నీ లోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపు
రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేసా
నీ కోసం వయసు వాకిలి కాశా
రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేసా
నీ రాకకు రంగం సిద్ధం చేశా
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీపేరు పెట్టింది వయ్యారం
ఓణీ కట్టింది గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది
చరణం
మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరి
వాస్తుగా పెంచానిట్ఠా వందకోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో కొసరీ కొసరీ
చెయ్యరా ముద్దుల దాడి
ఇష్టమేలే నీ సందడి
ముట్టడించి ముట్టేసుకోలేవ
ఓసారి చెయిజారి
రా ఏ బంగరు నక్లీసు. నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నను సింగారించు
రా ఏ వెన్నెల జోలాలి నను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీపేరు పెట్టింది వయ్యారం
ఓణీ కట్టింది గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాస్సేపు