Devara: గాంధీ జయంతి రోజు దేవర హవా.. 6 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

Devara: గాంధీ జయంతి రోజు దేవర హవా.. 6 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర-పార్ట్ 1(Devara) బాక్సాఫీస్ వద్ద మొదటి 5 రోజులలో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. దేవర తొలి వీకెండ్‍లో భారీ వసూళ్లను దక్కించుకోగా..సెకండ్ వీక్ లో మాత్రం డ్రాప్ అవుతూ.. పెరుగుతూ వస్తోంది.

ఇండియా వైడ్గా దేవర నాలుగోరోజు రూ.12.5 కోట్లు.. ఐదవరోజు రూ.14కోట్లు.. ఆరవరోజు గాంధీ జయంతి (అక్టోబర్ 2న) ఏకంగా రూ.21 కోట్లు నెట్ వసూళ్లు చేసింది.

లేటెస్ట్గా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజులకు గాను రూ.396కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు దేవర మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ వెల్లడించారు. "దేవర ప్రత్యర్థుల గుండెల్లో భయాన్ని కలిగించే రక్తంతో తడిసిన నాటకంలో ఉన్నారు..వరల్డ్ వైడ్గా ఆరు రోజుల్లో రూ.396కోట్లకి పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది" అని తెలిపారు. 

Also Read:-షారుఖ్ ధరించిన వాచీల ధర తెలిస్తే కంగుతినాల్సిందే!

Sacnilk బాక్సాఫీస్ ప్రకారం::

రోజు వారీగా దేవర ఇండియా వైడ్ బాక్సాఫీస్ రిపోర్ట్:: నెట్ కలెక్షన్స్

దేవర మూవీ థియేటర్లలో విడుదలైన మొదటి రోజు (సెప్టెంబర్ 27 శుక్రవారం) - రూ. 82.5 కోట్లు (తెలుగు: రూ. 73.25 కోట్లు, హిందీ: రూ. 7.5 కోట్లు, కన్నడ: రూ. 35 లక్షలు, తమిళం: రూ. 1 కోటి, మలయాళం: రూ. 40 లక్షలు)

2వ రోజు (శనివారం) - రూ. 38.2 కోట్లు (తెలుగు: రూ. 27.55 కోట్లు, హిందీ: రూ. 9 కోట్లు, కన్నడ: రూ. 35 లక్షలు, తమిళం: రూ. 1.05 కోట్లు, మలయాళం: రూ. 25 లక్షలు)

3వ రోజు (ఆదివారం) - రూ. 40.3 కోట్లు (తెలుగు: రూ. 27.7 కోట్లు, హిందీ: రూ. 11 కోట్లు, కన్నడ: రూ. 35 లక్షలు, తమిళం: రూ. 1.05 కోట్లు, మలయాళం: రూ. 25 లక్షలు)

4వ రోజు (సోమవారం) - రూ. 12.5 కోట్లు (తెలుగు: రూ. 8 కోట్లు, హిందీ: రూ. 4 కోట్లు, కన్నడ: రూ. 10 లక్షలు, తమిళం: రూ. 30 లక్షలు మరియు మలయాళం: రూ. 10 లక్షలు)

5వ రోజు (మంగళవారం) రూ.14 కోట్లు [తెలుగు 9.1 కోట్లు; హిందీ: రూ. 4025 కోట్లు, కన్నడ: రూ. 50 లక్షలు, తమిళం: రూ. 45 లక్షలు మరియు మలయాళం: రూ. 50 లక్షలు)

6వ రోజు (బుధవారం) రూ. 21 కోట్లు [తెలుగు రూ.13.55 కోట్లు; హిందీ: రూ. 6.5 కోట్లు; కన్నడ: రూ.0.25 కోట్లు; తమిళం: రూ.0.1 కోట్లు మరియు మలయాళం: రూ. 50 లక్షలు)

ఇక మొత్తం దేవర నెట్ కలెక్షన్స్ - రూ.208.35 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. [తెలుగు 159.35 కోట్లు ; ; హిందీ: రూ. 41.75 కోట్లు; కన్నడ: రూ.1.5 కోట్లు; తమిళం: రూ.4.55 కోట్లు; మలయాళం: రూ.1.2 కోట్లు].