Devara: ఓవర్సీస్లో దేవర హవా.. ఎన్టీఆర్ దెబ్బకు ఆ వెయ్యి కోట్ల సినిమా రికార్డు బ్రేక్

Devara: ఓవర్సీస్లో దేవర హవా.. ఎన్టీఆర్ దెబ్బకు ఆ వెయ్యి కోట్ల సినిమా రికార్డు బ్రేక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర (Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్టు తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవరపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన దేవర టీజర్, సాంగ్స్ కూడా హైప్ ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇక రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ సెప్టెంబరు 27న ప్రేక్షకుల  ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను రేపు  మంగళవారం (సెప్టెంబర్ 10న) రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

కాగా ఒవర్సీస్ లో అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ లో సరికొత్త రికార్డులతో దూసుకెళుతోంది దేవర. యూఎస్ఏ ప్రీమియర్ కు మరో 18 రోజుల సమయం ఉండగానే రికార్డు సమయంలోనే 25 వేల టికెట్లు అమ్ముడైనట్లు కూడా మేకర్స్ వెల్లడించారు. ఇప్పడే ఇలా ఉంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సేల్స్ మరింత పెరిగి రిలీజ్ సమయానికి ఎన్ని రికార్డులు బ్రేకవుతాయో చూడాలి.

Also Read :- సినీ ఇండస్ట్రీలో విషాదం

నార్త్ అమెరికా సేల్స్ చుస్తే ప్రస్తుతానికి 335 లొకేషన్స్ లో 945 షోలకు గాను $810,048 రాబట్టింది. టికెట్స్ పరంగా చుస్తే 26K+ పైగా బుక్ అయ్యాయి.  USA లో అత్యంత ఫాస్ట్ గా 26 వేల టికెట్స్ బుక్ అయిన చిత్రంగా మరొక రికార్డ్స్ క్రియేట్ చేసింది దేవర. US ప్రీమియర్స్ కు ఇంకా 18 రోజులు ఉండగా దేవర ఈ రేంజ్ బుకింగ్స్ సాధించడం  ఒక రికార్డు అనే చెప్పాలి. ఓవర్సీస్ మొత్తంగా $ 882,230 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం రెబల్ స్టార్ నటించిన కల్కి అడ్వాన్స్ బుక్కింగ్స్‌ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. 

‘దేవర’ చిత్రాన్ని నార్త్ బెల్ట్‌లో విడుదల చేసేందుకు భారీ ధరకు రైట్స్‌ను సొంతం చేసుకుంది బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్. ఇక ఎలాంటి ప్రమోషన్స్ తో ముందుకు తీసుకెళ్తోందో చూడాలి. ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటల 10 నిమిషాలని సమాచారం. అంత లెంగ్తీ టైమ్‌తో ఆడియెన్స్‌ను కూర్చోబెట్టడం కత్తి మీద సామే.