మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర (Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన దేవర సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. అటు ఏపీ ఇటు తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కోరుతూ ఇరు ప్రభుత్వాలకు దరఖాస్తు చేసారు దేవర నిర్మాతలు.
ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ శనివారం (సెప్టెంబర్ 21) దేవర సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‍లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో దేవర సినిమాకు సంబంధించిన ఒక్కో టికెట్‍పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు మూవీ టీమ్‍కు ఏపీ సర్కార్ ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్‍లలో బాల్కనీ టికెట్‍పై అదనంగా రూ.110, లోయర్ క్లాస్ టికెట్‍పై రూ.60 అధికం చేసేందుకు అనుమతి ఇచ్చింది.
ALSO READ : VenkyAnil3: ‘వెంకీ మామ’సెట్లో..బాలయ్య బాబు హుషారైన సందడి..వీడియో వైరల్
సెప్టెంబరు 27 నుండి 9 రోజుల పాటు అనగా అక్టోబరు 5వరకు ప్రతిరోజు 5 స్పెషల్ షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే కేవలం 27 తేదీన ఒక్క రోజు మాత్రమే 6 షోలు ప్రదర్శించుకునేలా ఉత్త్వరులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఆ రోజున అర్ధరాత్రి 12 గంటలకే తొలి షో పడనుంది.
#Devara ticket hike APPROVED.
— Manobala Vijayabalan (@ManobalaV) September 21, 2024
AP Gov permission for NTR's Devara:
6 shows On 27th September, Starting from 12 AM
110/- Hike In Single Screen Upper Class and 60/- Hike For Lower Class
135/-… pic.twitter.com/MnQH7druuA
రెండో రోజు నుంచి మరో తొమ్మిది రోజులు ప్రతీ రోజు 5 షోలు ప్రదర్శించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇక రెండు వారాల వరకు టికెట్లపై అదనపు ధరలు ఉంచుకోవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.