లండన్ లో ఫ్యామిలీతో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్...

లండన్ లో ఫ్యామిలీతో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్...

జూ. ఎన్టీఆర్ ఈఏడాది స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర పార్ట్ -1 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాగా దాదాపుగా రూ.650 కోట్లు (గ్రాస్)  కలెక్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకూ తారక్ సోలో హీరోగా నటించిన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ దేవర సినిమా సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఇయర్ ఎండ్ కి తన ఫ్యామిలీతో కలసి విదేశాలకి ట్రిప్ కి వెళ్ళాడు. ఈ క్రమంలో భార్య లక్ష్మీప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలసి  లండన్ లోని హైడ్ పార్క్ యొక్క వింటర్ వండర్‌ల్యాండ్‌లో గేమ్స్ ఎంజాయ్ చేస్తూ అభిమానుల కంటపడ్డాడు. ఇది గమనించిన కొందరు అభిమానులు తారక్ ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే ఎంజాయ్ ది హాలిడేస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ | SSMB29 Update: మహేష్ కోసం ఒడిశా అడవుల్లో రాజమౌళి..

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో ప్రముఖ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఎన్టీఆర్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమాకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖహిందీ సినీ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు.