Jr NTR: కామెడీ చేయడం చాలా కష్టం.. కష్టాలు ఉన్నప్పుడు నవ్వించగలిగే వ్యక్తి ఉండాలి

Jr NTR: కామెడీ చేయడం చాలా కష్టం.. కష్టాలు ఉన్నప్పుడు నవ్వించగలిగే వ్యక్తి ఉండాలి

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌‌లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థ నిర్మించిన  చిత్రం  ‘మ్యాడ్ స్వ్కేర్’. మార్చి 28న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా ‘మ్యాడ్ మ్యాక్స్ సెలబ్రేషన్స్’పేరుతో శుక్రవారం  సక్సెస్ మీట్‌‌ను నిర్వహించారు.

ఈ ఈవెంట్‌‌కు గెస్ట్‌‌గా హాజరైన ఎన్టీఆర్.. నటీనటులు, టెక్నీషియన్స్‌‌కు సక్సెస్ షీల్డ్‌‌లను అందించిన అనంతరం మాట్లాడుతూ ‘అభిమానులను కలిసుకుని చాలా కాలమైంది. ఈ వేదిక ద్వారా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ‘మ్యాడ్ స్వ్కేర్’సక్సెస్‌‌కు టీమ్ అందరికీ నా అభినందనలు. నవ్వించడం ఒక గొప్ప వరం. ఎన్నో బాధలు, కష్టాలు ఉన్నప్పుడు నవ్వించగలిగే వ్యక్తి దొరికితే బాగుండనిపిస్తుంది. అలా నవ్వించే వ్యక్తులు చాలా అరుదుగా దొరుకుతారు. అలాంటి వ్యక్తే ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్​ శంకర్.

హిట్ మూవీ తర్వాత  సీక్వెల్‌‌తోనూ అంతకంటే గొప్పగా ఆడియెన్స్‌‌ను అలరించడం చాలా కష్టం. కథను ప్యూర్‌‌‌‌ హార్ట్‌‌తో రాసుకుంటే సక్సెస్ గ్యారెంటీ అని నిరూపించారు. ఇక ఇందులో నటించిన  మురళీధర్, ఆంటోనీ పాత్రలు హిలేరియస్‌‌గా నవ్వించాయి. లడ్డు (విష్ణు)  పాత్ర లేకుంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో అనిపిస్తుంది. ఇన్నోసెంట్‌‌గా నటించి అందర్నీ నవ్వించాడు. సంగీత్ శోభన్, రామ్ నితిన్ తమ పాత్రలను అద్భుతంగా చేశారు. నాకు పెళ్లి  అయ్యే టైమ్‌‌కి  మా బామ్మర్ది (నార్నె నితిన్)  చాలా చిన్నోడు. యాక్టర్ అవుతానని చెప్పినప్పుడు ఎలాంటి సలహాలు చెప్పలేదు. మంచి దర్శకులతో పనిచేశాడు కనుక నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. నటుడిగా తనకు  మరింత భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా.

బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తర్వాత నాకిష్టమైన హాస్య నటుడు సునీల్. చాలా కాలం తర్వాత ఇందులో పాత సునీల్‌‌ను చూశాం. ఈ టీమ్ అందరి వెనుక ఒక శక్తిలా ఉంటాడు నాగవంశీ.  తనతో ఒక మూవీ చేయబోతున్నా.  త్వరలోనే అది అనౌన్స్ చేస్తాడు’ అని చెప్పాడు.  కార్యక్రమంలో పాల్గొన్న త్రివిక్రమ్  టీమ్‌‌ అందరికీ  అభినందనలు తెలియజేశారు.

‘మ్యాడ్’ఫస్ట్ పార్ట్‌‌ నుంచి  తమకు సపోర్ట్‌‌గా నిలిచిన ఎన్టీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పారు హీరోలు. ఈ విజయానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ  డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ థ్యాంక్స్ చెప్పాడు.  ఇంత గొప్ప సక్సెస్‌‌లో పార్ట్ అవడం హ్యాపీగా ఉందని నటులు సునీల్, సత్యం రాజేష్​,  హీరోయిన్స్ రెబా మోనికా జాన్, ప్రియాంక జవాల్కర్ చెప్పారు. నిర్మాతలు చినబాబు, నాగవంశీ, హారిక, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో,  లిరిసిస్టులు కాసర్ల శ్యామ్, పూర్ణాచారి, సురేష్​ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ఒక యాక్టర్‌‌‌‌కు  కామెడీని పండించడం చాలా కష్టం. మళ్లీ అలాంటి కామెడీ వస్తుందో రాదో అనే భయంతోనే  ‘అదుర్స్ 2’చేయడం లేదు. అలాగే  దేవర చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ‘దేవర2’కూడా కచ్చితంగా ఉంటుంది. కాకపోతే  మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చాడు కాబట్టి చిన్న  బ్రేక్ ఇచ్చాం. అభిమానులు కాలర్ ఎత్తుకునేలా సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను.