యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై అలరించబోతున్నాడా? అంటే అవునమే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ ప్రముఖ ఓటీటీ ఛానెల్ లో టాక్ షో చేసేందుకు ఒకే చెప్పాడని సమాచారం. దీంతో తారక్ ప్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకి అసలు విషయం ఏంటంటే.. ఓటీటీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం మేరకు.. ఈటీవీ ఛానెల్‌లో ఓ టాక్ షో చేయడానికి జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించారట మేకర్స్. ఈ షో ఈ టీవీ విన్ ఓటీటీ ఛానెల్‌లో ప్రసారం కానుందని సమాచారం.
అయితే, ఈ షో కోసం ఎన్టీఆర్ ఇప్పటికే సైన్ చేశారా? లేదా చర్చల్లోనే ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న బుల్లితెర ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. నిజానికి.. ఎన్టీఆర్ హోస్టింగ్ అంటే ఆ ఎనర్జీ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. తన మార్క్ పంచ్‌లతో ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇక త్రిపుల్ ఆర్ తరువాత ఎన్టీఆర్ క్రేజ్ కూడా నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ఇక ఇప్పుడు ఆయన క్రేజ్‌ను ఫుల్లుగా వాడేసుకోవడానికి ఫిక్స్ అయిందట ఈటీవీ.
ఇప్పటికే ‘ఆహా’ ఓటీటీలో బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే సమంత హోస్ట్ చేసిన ‘సామ్ జామ్’ షోకి కూడా మంచి రేటింగ్స్ వచ్చాయి. దీంతో.. ఎన్టీఆర్ చేసే షో ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎన్టీఆర్ ఇప్పటికే.. బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులు వంటి షోస్ కి హోస్ట్ గా చేశాడు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో పక్క మాస్ అండ్ కమర్షియల్ మూవీ ఒకటి చేస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.