NTR Voice over: విజ‌య్ దేవ‌ర‌కొండ VD 12 కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీస్లో..మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది VD12 అని చెప్పుకోవాలి. కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) కావడమే. ఈ దర్శకుడి నుండి వచ్చిన మళ్ళీ రావా, జెర్సీ సినిమాలు ఆడియన్స్ను అలరించాయి.ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.  ఈ సినిమా దాదాపు 80 శాతం వరకు చిత్రీకరణ పూర్తయింది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీగా వస్తోన్న ఈ ప్రాజెక్ట్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ అందించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ వాయిస్‌తోనే ఈ సినిమా కథ మొద‌ల‌వుతుంద‌ని సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఈ వాయిస్ ఓవ‌ర్ కోసం ప‌లువురు స్టార్ హీరోల‌ను అనుకున్న చిత్ర బృందం ఎన్టీఆర్ తోనే ఫిక్స్ అయినట్లు సమాచారం.  

VD12 సినిమాని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో ఎన్టీఆర్‌కు మంచి అనుబంధం ఉంది. ఆ రిలేషన్ వల్లే VD12 కథకి వాయిస్ ఓవ‌ర్ ఇవ్వడానికి రెడీ అయినట్లు టాక్. మరి ఎన్టీఆర్ ఇచ్చే వాయిస్ ఓవ‌ర్‌..రాబోయే టైటిల్ టీజర్ కోసమా? లేక మొత్తం సినిమా కోసమా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇటీవలే  VD 12 నుంచి విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంది.ఈ పోస్టర్కి నిర్మాత నాగవంశీ "అతని విధి అతని కోసం వేచి ఉంది. తప్పులు..రక్తపాతం..ప్రశ్నలు..పునర్జన్మ" అంటూ విభిన్నమైన క్యాప్షన్ తో సినిమాపై ఆసక్తి రేపారు. ఈ మూవీ 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.