
ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను అల్ట్రా స్టైలిష్‌గా చూపించాడు సుకుమార్. తాజాగా వీరి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుకుమార్ భుజంపై వాలి ఎన్టీఆర్ రిలాక్స్ అవుతున్నట్టుగా ఉన్న ఈ ఫొటోను సుకుమార్ భార్య తబిత ఇన్‌స్టాలో షేర్ చేసి ‘తారక్‌కు ప్రేమతో..’ అని క్యాప్షన్ ఇచ్చి ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేశారు. దీంతో ఈ స్ర్కీన్ షాట్‌ను ఎన్టీఆర్ కూడా షేర్ చేసి
నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్.. సుకుమార్’ అంటూ తన స్టేటస్‌లో పెట్టుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. క్యూట్ ఫొటో, క్యూట్ బాండింగ్ అంటూ ఈ స్టిల్‌కు నెటిజిన్లు కామెంట్లు పెడుతున్నారు. వీరిద్దరి కాంబోలో మరో మూవీ వస్తుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ వార్2 చిత్రంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. అలాగే ‘దేవర2’ చేయాల్సి ఉంది. మరోవైపు సుకుమార్ త్వరలోనే రామ్ చరణ్‌తో ఓ సినిమా స్టార్ట్ చేయనున్నారు. దీంతో ఈ క్రేజీ కాంబో మరోసారి చర్చల్లో నిలిచింది.