జపాన్‌‌‌‌లో దేవర రిలీజ్‌ .. ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్

జపాన్‌‌‌‌లో దేవర రిలీజ్‌ .. ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్

గతేడాది ‘దేవర’ చిత్రంతో పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. తాజాగా ఈ చిత్రాన్ని  జపాన్‌‌‌‌లో రిలీజ్ చేస్తున్నారు.  జపాన్‌‌‌‌లో తెలుగు సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’తో పాటు పలు భారతీయ చిత్రాలు అక్కడ విడుదలై సూపర్ సక్సెస్‌‌‌‌ను అందుకున్నాయి.  ఇప్పుడు ‘దేవర’ సినిమాను  మార్చి 28న జపాన్‌‌‌‌లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా అక్కడి ప్రమోషన్స్‌‌‌‌కు ఎన్టీఆర్ హాజరయ్యాడు.  ఇటీవల అక్కడి  మీడియాకు  వ‌‌‌‌ర్చువ‌‌‌‌ల్‌‌‌‌గా స్పెష‌‌‌‌ల్ ఇంట‌‌‌‌ర్వ్యూలు ఇవ్వగా, ఈసారి నేరుగా ప్రమోషన్స్‌‌‌‌లో పాల్గొన్నాడు. 

ఈ సందర్భంగా  జపాన్‌‌‌‌లోని  ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్‌‌‌‌లోనూ దేవర జాతర ఖాయం అంటూ అభిమానులు చెబుతున్నారు.  కొరటాల శివ రూపొందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్‌‌‌‌ రోల్‌‌‌‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ సంగీతం  అందించాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ సెకండ్ పార్ట్‌‌‌‌ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.