VD12: విజయ్ కోసం ఎన్టీఆర్ వాయిస్‌‌‌‌.. ప్రాణం పోసిన తారక్ అన్నకు థ్యాంక్స్: విజయ్ దేవరకొండ

VD12: విజయ్ కోసం ఎన్టీఆర్ వాయిస్‌‌‌‌.. ప్రాణం పోసిన తారక్ అన్నకు థ్యాంక్స్: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ సినిమా కోసం స్టార్ హీరోలంతా ఏకమయ్యారు. విజయ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌‌‌లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న  సంగతి తెలిసిందే. బుధవారం(Feb12) ఈ మూవీ టైటిల్‌‌‌‌ అనౌన్స్‌‌‌‌మెంట్‌‌‌‌తో పాటు టీజర్‌‌‌‌‌‌‌‌ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు టీజర్‌‌‌‌‌‌‌‌కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, తమిళ టీజర్‌‌‌‌‌‌‌‌కు సూర్య, హిందీ టీజర్‌‌‌‌‌‌‌‌కు రణ్‌‌‌‌బీర్ కపూర్ వాయిస్‌‌‌‌ను అందించినట్టు టీమ్ ప్రకటించింది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ కలిసున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు విజయ్.‘ఎన్టీఆర్ అన్నను కలవడం హ్యాపీ. ఆయనతో పర్సనల్ విషయాలతో పాటు జీవితం, కాలం, సినిమాల గురించి మాట్లాడుకున్నాం. డబ్బింగ్‌‌‌‌తో  టీజర్‌‌‌‌‌‌‌‌కు ప్రాణం పోసిన ఎన్టీఆర్ అన్నకు థ్యాంక్స్’ అని పోస్ట్ చేశాడు.  దీంతో టీజర్‌‌‌‌‌‌‌‌పై అంచనాలు ఏర్పడ్డాయి.

సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  విజయ్ హీరోగా నటిస్తున్న 12వ సినిమా ఇది.  ఇందులో పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా, ఖైదీగా రెండు గెటప్స్‌‌‌‌లో విజ‌‌‌‌య్‌‌‌‌ కనిపించనున్నాడని తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన తన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.