నందమూరి తారక రామారావు వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

హైదరాబాద్: నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ గార్డెన్కు చేరుకున్నారు. ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం కాసేపు సమాధి వద్ద కూర్చొని తాతయ్య జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదని, ఆయన నటిస్తుంటే పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన గొప్ప వ్యక్తి అని బాలకృష్ణ కొనియాడారు.

సీనియర్ ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ ఇంకా ఏమన్నారంటే..
* నట వీరుడు నట ధీరుడు.. ఇది అందరూ ఒప్పుకునే విషయం
* ప్రతి తెలుగు వాడూ బయటికి వచ్చి.. నేను తెలుగు వాడిని అని చెప్పుకొనే ధైర్యం కల్పించాడు
* తెలుగు దేశం పార్టీ పెట్టి పేద ప్రజలకు అండగా నిలిచాడు
* రాజకీయ పార్టీ పెట్టి అందరికీ అండగా నిలిచాడు
* పేద వాడి ఆకలి బాధ తెలిసిన అన్న ఎన్టీఆర్
* మహిళలకు అన్నగా అండగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్
* ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం
* అందరి గుండెల్లో నిలిచే నిత్యామృతంగా మారాడు ఎన్టీఆర్
* రాజకీయంగా ఆయన తెచ్చిన ఎన్నో పథకాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి
* తాలుకాల నుంచి మండలాలు ఏర్పాటు చేసింది కూడా ఎన్టీఆర్
* 2 రూపాయలకే బియ్యం అందించిన ఘనత కూడా ఎన్టీఆర్దే
* చెన్నై నగరానికి కూడా నీళ్ళు ఇచ్చి భగీరథుడు అయ్యాడు
* కూడూగుడ్డ సిద్ధాంతంతో సొంత ఇల్లులు అందించాడు
* ఎంతోమంది నాయకులను తయారు చేశాడు ఎన్టీఆర్
* ఎప్పటి వరకు ఒకే కోవలో వెళ్తుంటే.. రాజకీయ విధానాలను మార్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్
* ఆయన శివైకం అయ్యి 29 ఏళ్లు గడిచినా.. ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారు

ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ఏమన్నారంటే..
* ఎన్టీఆర్ కథా నాయకుడిగా ఉంటూ ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు
* తెలుగు జాతి ఆత్మ గౌరవానికి అన్యాయం జరుగుతుందని భావించి తెలుగోడి సత్తాను చాటిన మహా నాయకుడు 
* టీటీడీ భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ప్రారంభించింది అన్న ఎన్టీఆర్
* తెలుగు జాతి మనది అంటూ ప్రాంతాలు వేరైనా ప్రజలందరికి సేవలు అందించారు

హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఏమన్నారంటే..
* ఎన్టీఆర్ తెలుగు వాళ్ల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతారు